పొత్తు కుదిరిన వేళ పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్..

by Indraja |   ( Updated:2024-03-10 16:04:10.0  )
పొత్తు కుదిరిన వేళ పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్..
X

దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. తాజాగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన విషయం అందరికి తెలిసిందే. కాగా పొత్తు కుదిరిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు.

ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకపాలనకు రానున్న ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని బీజేపీ,టీడీపీ,జనసేన కూటమి ముగింపు పలకనుందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా ఏపీ విభజనలో అర దశాబ్ద కాలంగా వైసిపి ప్రభుత్వ విధానపరమైన తీవ్రవాదం, అవినీతి, ఇసుక, విలువైన ఖనిజాల వంటి సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియాతో రాష్ట్రం అల్లకల్లోలం అయిందని పేర్కొన్నారు.

దేవాలయాలను అపవిత్రం చేయడం, టిటిడిని ఎటిఎంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష నాయకులు వారి పార్టీ కేడర్‌పై బలవంతం మరియు భౌతిక దాడులకు పాల్పడ్డారని, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం మొదలైన అకృత్యాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పారిపోయారని ధ్వజమెత్తారు.

ఎర్రచందనం స్మగ్లింగ్, 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యం, దళితులపై అత్యధిక దౌర్జన్యాలు మొదలైన అకృత్యాలతో రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రాజకీయ గందరగోళం ఏర్పడిందని తెలిపారు. ఇక బీజేపీలో తమకు భాగస్వామ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Read More..

జగన్ గ్రీన్ మ్యాట్ సభ.. ఆ ఒక్క మీడియాకే అనుమతి..

Advertisement

Next Story

Most Viewed