డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణకు టైమ్ ఫిక్స్

by Satheesh |
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణకు టైమ్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణకు టైమ్ ఫిక్స్ అయ్యింది. బుధవారం ఉదయం 9:30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మ.12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో మాట్లాడనున్నారు. అనంతరం మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో సమావేశం కానున్నారు.

రాత్రి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ బస చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్.. ఈ సారి పిఠాపురం నుండి భారీ మెజార్టీతో విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు.

Read More..

వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కావు టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Next Story