‘ఇది జగన్మాత ఆదేశం’.. పవన్ కల్యాణ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-16 11:25:15.0  )
‘ఇది జగన్మాత ఆదేశం’.. పవన్ కల్యాణ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన(Janasena Party) ఆవిర్భావ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారని మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు కదా.. మరి తమిళ సినిమాల్ని హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అటు డీఎంకే(DMK) శ్రేణులతో నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) సైతం స్పందిస్తూ పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. జనసైనికులు సైతం వారికి తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పవన్ వివరణ ఇచ్చారు. తానేప్పుడు హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను. ఎన్‌ఈపీ-2020 (NEP-2020) స్వయంగా హిందీని అమలు చేయలేదు.

హిందీ భాష(Hindi Language) అమలు విషయంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలు (మాతృ భాషతో పాటుగా) నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. హిందీ వద్దనుకుంటే వారి మాతృ భాషతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ... ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు’ అని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘‘ఉత్తరాదినున్న హిమాలయాలలో ‘పరమశివుని’ కైలాసం ఉంది. దక్షిణాదిన ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసముంది.. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘’భారత దేశం’.. ఇది జగన్మాత ఆదేశం’’ అని తాజా ట్వీట్‌లో పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed