Pawan Kalyan జెండా ఆవిష్కరణపై ట్రోల్స్.. వివరణ ఇచ్చిన Janasena

by srinivas |
Pawan Kalyan జెండా ఆవిష్కరణపై ట్రోల్స్.. వివరణ ఇచ్చిన Janasena
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే పాదరక్షలతో జెండా ఎగురవేశారంటూ వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తోంది. అంతేకాదు పవన్ కల్యాణ్ దేశభక్తిని శంఖించేలా సెటైర్లు వేస్తోంది. ఈ అంశంపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. భారత జాతీయ పతాక కోడ్ 2002 ప్రకారం ఎక్కడా కూడా జాతీయ పతాకం ఎగురవేసేప్పుడు పాదరక్షలు వేసుకోకూడదని చెప్పలేదని వివరణ ఇచ్చింది. కాబట్టి జాతీయ పతాకం ఎగురవేసేప్పుడు ఎలాంటి పాదరక్షలు వేసుకున్నా అది జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచినట్లు కాదని తెలిపింది. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను జనసేన పార్టీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story