- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీచర్స్‌ను వైసీపీ ప్రభుత్వం హింసకు గురిచేస్తోంది.. Pawan Kalyan
దిశ, ఏపీ బ్యూరో : 'ఉపాధ్యాయ దినోత్సవం శుభవేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని మన సమాజంతోపాటు నేను విశ్వసిస్తాను. ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులందరితోపాటు సర్వేపల్లిని గౌరవించుకున్నట్లే అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. టీచర్స్ డేను పురస్కరించుకుని ఓ ప్రకటన విడుదల చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పని చేయడం తెలుగువారికి దక్కిన భాగ్యం అని కొనియాడారు. 'వేద కాలం నుంచి భారతదేశంలో గురు - శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంది. తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారు.
నెల్లూరులో నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ నా బాల్య స్నేహితుల ద్వారా నా యోగక్షేమాల గురించి తెలుసుకుంటుంటారు. అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుంది. వారు చెప్పిన మాటలు, బోధించిన పాఠాలు గుర్తుకు వస్తుంటాయి. తల్లిదండ్రుల తరువాత గురువుల వద్దే అవాజ్యమైన వాత్సల్యం మనసును స్పర్శిస్తుంది. అటువంటి దైవ స్వరూపులైన గురువులందరూ సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నాను' అని పవన్ కల్యా్ణ్ ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యాయుల పోరాటానికి జనసేన మద్దతు
'ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళావిహీనంగా కనిపించే పరిస్థితులు నెలకొనడం బాధ కలిగిస్తోంది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలియజేస్తుంది. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరు చరిత్రహీనులుగా మిగిలిపోయారని అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. వేధింపులతో పాలిస్తున్న ఈ కబోది ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కళ్ళు తెరిపించవలసిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను' అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Also Read : డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి