- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
NTR ట్రస్ట్‌కు పవన్ కల్యాణ్ భారీ విరాళం.. హ్యాపీగా ఫీలైన చంద్రబాబు, బాలకృష్ణ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(DCM Pawan Kalyan) మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్( NTR Trust)కు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అతి త్వరలో నారా భువనేశ్వరిని కలిసి చెక్‌ను అందిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా.. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం(Vijayawada Indira Gandhi Stadium)లో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) నేతృత్వంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), సినీ నటుడు బాలకృష్ణ(Nandamuri Balakrishna) హాజరయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తలసేమియా వ్యాధి గురించి ప్రజలకు, బాధితులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నగదును తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం భువనేశ్వరి వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం పవన్ కల్యాణ్ రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అభినందించారు.
*తలస్సేమియా పిల్లలు కోసం 50 లక్షలు విరాళం ప్రకటించిన.. నా దేవుడు Kalyan బాబు❤️🙏*
*#GodPawanKalyan❤️🙏*
Posted by Sreenivasarao Beeram on Saturday 15 February 2025