పవన్ కళ్యాణ్ ఇది చూస్తున్నావా.. మాజీమంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
పవన్ కళ్యాణ్ ఇది చూస్తున్నావా.. మాజీమంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి (Tirupati)లో కూటమి పార్టీల అరాచాకాలతో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూని అవుతున్నదని మాజీమంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా (YCP Leader RK Roja) అన్నారు. డిప్యూటీ మేయర్ (Deputy Mayor) ఎన్నికలపై స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం (NDA Government)పై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి (CM) అయినప్పటి నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట దిగజారిపోతోందని అన్నారు. లడ్డూ వ్యవహారం కానీ, మనుషులు చనిపోయిన ఘటనలో కానీ, ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పోరేటర్లు (YCP Corporaters) మాకు వద్దు అంటూనే.. మేయర్ పై, కార్పోరేటర్లపై, దళిత ఎంపీపై దాడులు చేయడం చూస్తున్నామని అన్నారు.

ఇవన్నీ చూస్తు కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. అలాగే జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) ఎంత దిగజారిపోయి కార్పోరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గమణించాలని చెప్పారు. కూటమి పార్టీలది ఈవీఎంల(EVM) గెలుపు అని మళ్లీ రుజువైందని అన్నారు. ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఒక మేయర్ మీద దాడి చేయడం, ఎంపీ మీద దాడి చేయడం చూస్తుంటే.. ఈ ఏడు నెలల కాలానికే కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారని తెలిసి, దిగజారుడు రాజకీయాలు, గుండా రాజకీయాలు చేయాలనుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.

అరచాకాలను ఆపి, కార్పోరేటర్ల కిడ్నాప్ కు పాల్పడిన టీడీపీ(TDP), జనసేన నాయకులను(Janasena Leaders) శిక్షపడే విధంగా చూడాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ను రిక్వెస్ట్ చేస్తున్నానని అన్నారు. అంతేగాక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ప్రజాస్వామ్య బద్దంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూటమి అరాచకాలపై తిరగబడే రోజులు ఎక్కువ దూరంలో లేవని, తిరుపతిలో కూటమి పార్టీల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇక తిరుపతిలో ఏం జరిగినా.. తన దిగజారుడు రాజకీయాలతో తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ఇవన్నీ గమణించి చంద్రబాబుకు బుద్ది చెప్పాలని తిరుపతి ప్రజలకు రోజా కోరారు.

Next Story