Elephant Attack: ఏనుగుల దాడి.. మృతులకు రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

by D.Reddy |
Elephant Attack: ఏనుగుల దాడి.. మృతులకు రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అన్నమయ్య జిల్లా గుండాలకోన ఏనుగుల దాడి (Elephant Attack) ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Dy.CM Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అటవీ శాఖ అధికారులను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అనంతరం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chadrababu) కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పరామర్శించి ధైర్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ప్రకటించారు.

కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తరలివెళుతుంటారు. సోమవారం రాత్రి 14 మంది భక్తులు కాలినడకన అటవీ మార్గంలో వెళ్తుండగా ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దాడి నుంచి 8 మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.

Next Story