AP News:మాజీ సీఎం జగన్‌ను కలిసిన పార్టీ కార్యకర్తలు..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP News:మాజీ సీఎం జగన్‌ను కలిసిన పార్టీ కార్యకర్తలు..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నేడు (బుధవారం) ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు కలిశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ అందరినీ పేరుపేరునా పలకరించారు. ఓ పిల్లాడికి ఆత్మీయంగా ముద్దు కూడా పెట్టారు. కొంతమంది మాజీ సీఎం తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలువురు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. ఎవరు అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి తమ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. అనంతరం జగన్ బెంగళూరుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే..

Advertisement

Next Story