ఏపీలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్.. ఎస్పీ మలిక గార్గ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-05-21 09:44:06.0  )
ఏపీలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్.. ఎస్పీ మలిక గార్గ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల వేళ, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కర్రలు, రాడ్లు, రాళ్లు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది. ఘటనలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు పల్నాడు జిల్లాలో సిట్ బృందం దర్యాప్తు చేసింది. అల్లర్ల ఘటనలపై నివేదిక రెడీ చేసి డీజీపీకి అందజేశారు.

అయితే సస్పెండైన ఎస్పీ స్థానంలో మల్లిక గార్గ్ నియమితులయ్యారు. దీంతో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే జిల్లాలోని శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఏపీకి దేశంలోనే మంచి పేరుందని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులతో శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పారు. రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్‌ను గౌరవించాలని సూచించారు. అతిక్రమిస్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లిక గార్గ్ హెచ్చరించారు.

Read More...

33 కేసులు.. 1380 మంది నిందితులు.. సిట్ నివేదికలో సంచలన విషయాలు..!

Advertisement

Next Story