- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
P4 Method: జీరో పావర్టీ విధానంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 విధానం(P4 Method) అని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాముల అవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పిలుపునిచ్చారు. పీ4 విధానం అమలుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరి సంకల్పంతో జీరో పావర్టీ(Zero Poverty) పీ-4 విధానం అని తన అభిప్రాయాలతో కూడిన లేఖ విడుదల చేశారు.
దీనిపై ఆయన.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు(Sankranthi Wishes) తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని, మనం, మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండడమే పండుగ అని అన్నారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి, సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన P4 (పబ్లిక్ -ప్రైవేటు- పీపుల్-పార్టనర్షిప్)(Public-Private-People-Partnership) విధానంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఇక ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని చంద్రబాబు రాసుకొచ్చారు.