- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:‘మాది ప్రజా ప్రభుత్వం..పేదలకు అండగా ఉంటాం’..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జులై 1వ తేదీన ఏపీలో సీఎం చంద్రబాబు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు (గురువారం) సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ క్రమంలో మాది ప్రజా ప్రభుత్వం..పేదలకు అండగా ఉంటాం అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వివరాల్లోకి వెళితే..సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించారు. గుండుమల గ్రామస్తులతో సీఎం ముఖాముఖి సమావేశంలో ప్రసంగించారు. గుండుమలలో చంద్రబాబు ప్రజా వేదిక ప్రాంతంలో జోరువాన కురుస్తున్న లేక్కచేయకుండా సీఎం చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ, వక్క రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వక్క రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ద్వారా జవాబుదారీ పాలన అని అన్నారు. ఒక్కరోజులోనే 97 శాతం పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం మాదేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెన్షన్ల పంపిణీ చేశాం అన్నారు. రూ.4 వేల పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసానికి అంతే లేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.