- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వం సిద్ధం.. జగన్, షర్మిల భవష్యత్తును తేల్చనున్న యూనివర్సిటీ ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమయింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బలగాలను మోహరింపచేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో మరిన్ని బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లాలోనూ ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రయకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజవకవర్గం ఉంది. కడప పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ, పులివెందుల, బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజవర్గాలకు సంబంధించి కడప మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు రెడీ చేశారు. ఇక కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ షర్మిల, పులివెందుల అసెంబ్లీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి పోటీ చేశారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది.
కాగా కడప జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 22 వేల 669 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. కడప పార్లమెంట్ పరిధిలో 22 వేల 657 ఓట్లు పోల్ అయ్యాయి. కడప అసెంబ్లీకి సంబంధిం 287 కౌంటింగ్ కేంద్రాలు రెడీ చేశారు. 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. పులివెందులకు సంబంధించి 301 కౌంటింగ్ కేంద్రాల్లో 22 రౌండ్లలో లెక్కిస్తారు. కమలాపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి 251 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. జమ్మలమడుగుకు సంబంధించి 315 కేంద్రాల్లో 23 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఇక ప్రొద్దుటూరుకు సంబంధించి 268 కౌంటింగ్ కేంద్రాలను రెడీ చశారు. 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. మైదుకూరుకు సంబంధించి 269 కౌంద్రాల్లో 20 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఇక ఉర్దూ యూనివర్సిటీ నుంచి 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి ఏజెంట్లు తీసుకురావాలని, ఎలాంటి గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు.