ఎంత కష్టమైనా సరే నిజాయతీని వీడొద్దని ఎన్టీఆర్ మాకు చెప్పేవారు: నారా భువనేశ్వరి

by Seetharam |
ఎంత కష్టమైనా సరే నిజాయతీని వీడొద్దని ఎన్టీఆర్ మాకు చెప్పేవారు: నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎంత కష్టమైనా సరే నిజాయతీని వీడొద్దని, తెలుగు వారి ఉన్నతికి పాటుపడాలని తన తండ్రి దివంగత సీఎం ఎన్టీఆర్ చెప్పారని నారా భువనేశ్వరి తెలిపారు. నారావారి పల్లెలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిజం గెలవాలి బస్సు యాత్రను భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడారు. తెలుగు జాతి అభ్యున్నతికి ఎన్టీఆర్ తన జీవితాన్నే అంకితం చేశారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఎప్పుడూ సత్య మార్గంలోనే నడవాలని... ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దారిమార్చుకోవద్దని చెప్పారని భువనేశ్వరి గుర్తు చేశారు. ఎన్టీఆర్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని స్పష్టం చేశారు. తెలుగు జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడుని అన్యాయంగా జైలులో పెట్టారని, 47 రోజులుగా బంధించి ఉంచారని భువనేశ్వరి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక కొంతమంది మరణించారని వారిని పరామర్శించి వారికి అండగా ఉండాలనే ఉద్దేంతో బస్సు యాత్రను ప్రారంభించినట్లు భువనేశ్వరి తెలిపారు.తాను చేపట్టిన ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలని భువనేశ్వరి కోరారు.

Advertisement

Next Story

Most Viewed