- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు నూతన ప్రభుత్వం జలక్ .. పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకి నోటీసులు
దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా, అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ ప్యాలెస్‌ల తరహాలో పార్టీ కార్యాలయాలను కట్టారు. వాటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో లాంటి అనుమతులు తీసుకోకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అధునాతన హంగులతో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. అయితే వైసీపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పార్టీ కార్యాలయాలు నిర్మించినట్టు తాజగా చేసిన విచారణల్లో తేలింది. దీనితో పలు జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విశాఖ, అనకాపల్లి, నెల్లూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో వైసీపీ నిర్మించిన, నిర్మిస్తున్న, అలానే ఇప్పటికే నిర్మించిన కార్యాలయాలకీ అధికారులు నోటీసులు జారీ చేశారు.