Ap News: ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి

by srinivas |
Ap News: ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల హాజరుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ఆర్.ముత్యాల రాజు స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధుల వద్ద పని చేస్తున్న ఓఎస్డీలు, పీఎస్‌లు, అదనపు పీఎస్‌లు, పీఏలకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానంపై ఫిబ్రవరి 17న జారీ చేసిన మెమోలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పని చేసే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని తప్పక పాటించాలని సూచించారు. ఈయాప్‌లో టూర్/ఆన్ డ్యూటీ అనే ఆఫ్సన్‌ను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందని ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed