AP liquor policy: ఏపీ మద్యం పాలసీలో అక్రమాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

by Mahesh |   ( Updated:2024-07-24 15:43:15.0  )
AP liquor policy: ఏపీ మద్యం పాలసీలో అక్రమాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా లోకల్ బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొచ్చిన మద్య విధానంలో అనేక అవకతవకలు జరిగాయని.. వాటిపై సీఐడీతో విచారణ చేయిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పవన్ విజ్ఙప్తి పై స్పందించిన చంద్రబాబు.. సీఐడీతో వాస్తవాలు వెలికితీస్తామని హామీ ఇచ్చారు. అలాగే మద్యం అమ్మకాల్లో మొత్తం నగదు లావాదేవీలు చేశారని,, ఈ అక్రమాలపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామని.. అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చూస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

Read More..

Breaking:ఈ నెల 26న ఢిల్లీకి సీఎం చంద్రబాబు..కారణం ఏంటంటే?

Advertisement

Next Story

Most Viewed