Bad News: తెలుగు ప్రజలకు ముఖ్యగమనిక.. రేపు ఈ పని చేయొద్దు..!

by srinivas |   ( Updated:2025-01-25 10:10:18.0  )
Bad News: తెలుగు ప్రజలకు ముఖ్యగమనిక.. రేపు ఈ పని చేయొద్దు..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రజల(Telugu People)కు బ్యాడ్ న్యూస్ వరించింది. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలపై ఆదివారం నిషేధం విధించినట్లు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. గణతంత్య్ర దినోత్సవాలు(Re Public Day) జరుగుతుండగా మాంసం(NonVeg), మద్యం షాపులు(Wine Shops) మూసివేయాలని, అలా కాదని తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. కాగా వారాంతం మొత్తం మాంసం షాపులు, వైన్ షాపులు తెరిచే ఉంటాయి. మాంసం ప్రియులకు చికెన్(Chicken), మటన్(Motton), చేపలు(Fishes), రోయ్యలు(Frans), పీతలు వంటివిగా దొరుకుంటాయి. అటు మార్కెట్‌(Market)లోనూ భారీగా వ్యాపారం జరుగుతుంటుంది. ఆదివారం వస్తే నాన్ వెజ్ ప్రియులు, మద్యంబాబులు, వ్యాపారులకు పండగే పండగ. మాంసం మందు, అమ్మేవాళ్లకు మంచి బిజినెస్ నడుస్తోంది. తాగేవాళ్లకు తాగినంత మందు, తినే వాళ్లకు తిన్నన్ని ముక్కలు బాగానే దొరుకుతాయి. ఇంట్లో, హోటళ్లలోనూ మంచిగా లాగించేస్తారు. ఇక పార్టీలు చేసేకునే వాళ్లైతే మద్యం, నాన్ వెజ్ కుమ్మేస్తుంటారు. ఇలా మద్యం, మాంసం ప్రియులు సంతృప్తి చెందుతుంటారు

అవేవీ నడవవ్...

అయితే ఈ ఆదివారం అవేవీ నడవవ్. నోరు కట్టుకుని ఇంటికాడే కూర్చోవాలి. ఆకులు, కూరగాయాలు వండుకు తినాలి. కాదని అతిక్రమిస్తే కఠిన చర్యలకు గురవుతారు. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మద్యం, నాన్ వెజ్ షాపులతో పాటు షిప్ మార్కెట్స్ కూడా బంద్ కానున్నాయి.

గాంధీ చెప్పారంటే..

చేతి కర్రపట్టి ఒంటరిగా బయల్దేరి వందల మంది సైన్యాన్ని ఎదురించి మహాత్మాగాంధీ స్వాతంత్య్రం తీసుకొచ్చారని, సత్యం, అహింస ఆయన మార్గమని, గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆదివారం రోజైనా పాటిద్దామని రెండు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలందరూ గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఆదివారం మద్యం, నాన్ వెజ్ షాపులపై నిషేధించడం జరిగిందని తెలిపాయి. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాయి.

ముందు జాగ్రత్తగా..

ఇది ఉండలా మద్యం ప్రియులు ముందు జాగ్రత్త పడుతున్నారు. శనివారం(ఈ) రోజే కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ పెట్టుకుంటున్నారు. అటు మాంసం ప్రియులు మాత్రం వండిని కూరను ప్రిడ్జ్‌లో దాచుకుని ఆదివారం తినేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆదివారం ఏపీ, తెలంగాణ(Ap, Telangana)లో అన్ని చికెన్, మటన్, ఫిష్, వైన్స్ షాపులు మూసివేతతో బోసిపోయి కనిపించనున్నాయి. ఇక మద్యం, మాంసం ప్రియులు ఒక్కరోజైనా స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ బాటలో నడుస్తారని కోరుకుందాం.

Next Story

Most Viewed