AP News:‘ఇంగ్లీష్ మీడియం కావాలి..కానీ తెలుగును మరువద్దు’ ..మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-24 15:50:55.0  )
AP News:‘ఇంగ్లీష్ మీడియం కావాలి..కానీ తెలుగును మరువద్దు’ ..మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అవసరమని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. ఏపీలో నేడు జరిగిన శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ ఆంగ్ల విద్య పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంగ్ల విద్యకు ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదు అన్నారు. కానీ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఈ క్రమంలో మాతృభాషలో మాట్లాడేందుకు వారు తనలా ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు. 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ అవసరమా? అన్న ప్రశ్నకు మండలిలో ఆయన బదులిచ్చారు. అప్పుడప్పుడు నేను తడబడుతుంటా అని ఆయన తెలిపారు. రెండు బ్యాలెన్స్ చేసేలా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. సభ్యులందరితో చర్చించి వంద రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా పెద్దగా ప్రయోజనం కనిపించలేదని మంత్రి లోకేష్ అన్నారు.

Read More..

AP News:‘తల్లికి వందనం’ పథకం పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన..!

Advertisement

Next Story

Most Viewed