నయాదోపిడీ: టీసీలుగా కేటుగాళ్ల అవతారం.. అసలు టీసీకి తారసపడటంతో..

by Seetharam |
నయాదోపిడీ: టీసీలుగా కేటుగాళ్ల అవతారం.. అసలు టీసీకి తారసపడటంతో..
X

దిశ, డైనమిక్ బ్యూరో : మోసాలకు కాదేది అనర్హం అన్నట్లు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే దుర్భుద్ధితో దారుణాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని నయా మోసాలకు తెరలేపుతున్నారు. అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుని దండుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి చీరాల రైల్వే స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు నకిలీ టీసీలుగా అవతారం ఎత్తారు. ఈ ముగ్గురు గత కొద్ది రోజులుగా టీసీల యూనిఫామ్ ధరించి రైళ్లలో టికెట్లను తనిఖీ చేస్తున్నారు. టికెట్ లేని అమాయకుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. ఇలా చేస్తుండగా మంగళవారం చీరాల రైల్వే టీసీ రాజేశ్‌కు నిందితులు తారసపడ్డారు. ఈ ముగ్గురు టీసీలు నకిలీలని నిర్ధారించుకుని జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జీఆర్పీ పోలీసులు నిందితులను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండయ్య బుధవారం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed