- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap News: పొలంలో నాటు తుపాకులు.. పోలీసుల హెచ్చరిక ఇదే..!

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కనేకల్- సోల్లాపూర్ గ్రామాల మధ్య పొలాల్లో రెండు నాటు తుపాకులను రాత్రి సమయంలో పడేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. నాటు తుపాకులను చూసి భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ‘‘నాటు తుపాకులు ఎక్కడివి, ఎవరివి, పొలాల్లో ఎందుకు పడేశారు’’ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. పొలంలో పడేసిన నాటు తుపాకులు ఎవరివనే విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. లైసెన్సు లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని, తుపాకులు, పేలుడు పదార్థాలు ఎవరూ తమ ఉంచుకోవద్దన్నారు. వణ్యప్రాణులను వేటాడటం కూడా నేరమని చెప్పారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని, అలా ఎవరి వద్దనైనా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.