Big Breaking:నేడు ఆ జిల్లాలో భువనేశ్వరి పర్యటన.. బాధితులకు ఆర్థికసహాయం

by Indraja |
Big Breaking:నేడు ఆ జిల్లాలో భువనేశ్వరి పర్యటన.. బాధితులకు ఆర్థికసహాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపత్ని.. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు "నిజం గెలవాలి" కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె బుధవారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా ఆమె చేపట్టిన మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది.

ఈ రోజు నారా భువనేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా లోని అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో నేడు ఆమె పర్యటించనున్నారు. కాగా ఈ రోజు పర్యటన నేపథ్యంలో.. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో వేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి .. వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. పర్యటన అనంతరం నారా భువనేశ్వరి ఈ రోజు సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి విమానం లో ప్రయాణించి హైదరాబాద్ కు రానున్నారు.

Advertisement

Next Story