వేముల సతీశ్‌పై కేసు.. నారా లోకేశ్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 16 |
వేముల సతీశ్‌పై కేసు.. నారా లోకేశ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై విజయవాడ సింగ్‌నగర్‌లో గులకరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో వేముల సతీశ్‌ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అయితే వేముల సతీశ్‌ను మరింత విచారించేందుకు పోలీసుల అభ్యర్థనతో హైకోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. దీంతో వేముల సతీశ్‌ను లాయర్ సమక్షంలో పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేముల సతీశ్‌తో పాటు అతని కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు. గులకరాయి దాడి ఘటనలో తప్పుడు కేసు ఎదుర్కొంటున్న వడ్డెర కులస్తుడు, యవకుడు వేముల సతీష్‌ను, అతని కుటుంబాన్ని మేం అధికారంలోకి రాగానే ఆదుకుంటాం. అతనిపై విజయవాడ పోలీసులు పెట్టిన తప్పుడు కేసు ఎత్తివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారందరిని ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తున్నా.’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed