Breaking News : శంఖారావంలో నారా లోకేష్ పంచ్ డైలాగ్.. సభ సైలెంట్

by Indraja |   ( Updated:2024-02-13 06:16:42.0  )
Breaking News : శంఖారావంలో నారా లోకేష్ పంచ్ డైలాగ్.. సభ సైలెంట్
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో శంఖారావం భహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాగా ఈ సభలో పాల్గొనేందుకు విచ్చేసిన నారా లోకేష్ వేదికపైకి రాగానే టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా పైకి లేచి హర్షద్వానాలతో హోరెత్తారు. ఈ నేపథ్యంలో కార్య నిర్వాహకులు అభిమానులను నిశబ్ధంగా కూర్చోవాల్సిందిగా కోరారు. కానీ టీడీపీ అభిమానులు వినిపించుకోలేదు.

నారా లోకేష్ ను చూసిన ఆనందంలో పెద్దగా జేజేలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సభను సజావుగా ముందుకు కొనసాగించేందుకు నారా లోకేష్ పూనుకున్నారు. మైక్ తీసుకున్న నారా లోకేష్ కార్యకర్తలను, టీడీపీ అభిమానులను ఉద్దేశించి.. తమ్ముడు మీరందరు కూర్చోవాలి, ,మనం క్రమశిక్షణకు మారుపేరు, పద్ధతి నేర్చుకోవాలి మీరు..కూర్చోమన్నప్పుడు గౌరవంగా కూర్చోవాలి రెండోసారి నేను చెప్పను.. రెండో సారి చెప్పే అలవాటు నాకు లేదు అన్నారు. ఇక ఈ ఒక్క మాటతో అందరూ కూర్చోగా సభ నిశబ్ధంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed