ఇక తనయుడి వంతు: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేశ్

by Seetharam |   ( Updated:2023-09-27 11:23:23.0  )
ఇక తనయుడి వంతు:  ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ కేసులో ఏ-14 నిందితుడిగా లోకేశ్ పేరును సీఐడీ మెమోలో పేర్కొంది. త్వరలోనే నారా లోకేశ్ మలివిడత యువగళం పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌పేరును చేర్చడంపై టీడీపీ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story