- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: నేడు ఆ జిల్లాలో నారా చంద్రబాబు పర్యటన..
దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులేస్తూ ప్రముఖ పార్టీలు చేపడుతున్న ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఉట్టిపడుతోంది. ఇక జరగనున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు.
అలానే అధికార పార్టీని గద్దె దింపి.. టీడీపీ జెండాను రెపరెపలాడించేందుకు రాజకీయ చాణిక్యుడుగా పేరుగాంచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా రా కదిలిరా బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో లోని 80 ఫీట్స్ రోడ్డులో రా కదిలిరా భహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఇక ఈ సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీకాకుళం లో నిర్వహించనున్న రా కదిలిరా భహిరంగ సభకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటుగా లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేస్తోందని సమాచారం.
ఇక శ్రీకాకుళం జిల్లాలో లోని 80 ఫీట్స్ రోడ్డులో చంద్రబాబు చివరి సభ 2013 లో జరిగింది. ఈ క్రమంలో 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీనితో ఆ ప్రాంతంలో మళ్ళీ సభను నిరవహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో విజయం వర్శిస్తుందనే సెంటిమెంట్ టీడీపీ లో ఉందని సమాచారం. కాగా సభ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై 5:30 గంటలకు ముగుస్తుందని టీడీపీ నేతల నుండి అందిన సమాచారం.
Also Read..
CM Jagan: కుప్పంలో టెన్షన్.. టెన్షన్..! నేడు నియోజకవర్గానికి సీఎం జగన్ రాక