నిరాహార దీక్షకు దిగిన నారా భువనేశ్వరి

by Seetharam |   ( Updated:2023-10-02 06:58:24.0  )
నిరాహార దీక్షకు దిగిన నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి మహాత్మా గాంధీ జయంతి రోజున నిరాహార దీక్షకు దిగారు. సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్ష సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఇకపోతే సత్యమేవ జయతే దీక్షకు ముందు రాజమహేంద్రవరంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర నేత ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం క్వారీ మార్కెట్ ఏరియాలో నారా భువనేశ్వరి దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నేతలు తరలివచ్చారు.

Advertisement

Next Story