Naga Babu: నాకు నచ్చిన సినిమా అదే.. నాగబాబు

by Indraja |   ( Updated:2024-03-06 15:44:06.0  )
Naga Babu: నాకు నచ్చిన సినిమా అదే.. నాగబాబు
X

దిశ డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చిగడ్డి వేసినా భగ్గుమంటోంది. ముఖ్యంగా వైసీపీకి, జనసేనకు మధ్య మాటల యుధం కాస్త ముదిరి ప్రజాసమస్యలను పక్కన పెట్టి వ్యక్తి గత విషయాలపై విమర్శలు చేసుకునేస్థాయికి వెళ్ళింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో ప్రస్తావిస్తున్నారు.

అయితే జగన్ విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్న అనుకున్న పవన్ కళ్యాణ్ తనకి మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు మాత్రమే అయ్యాయని.. మరి నాలుగో పెళ్లి ఎప్పుడైనది.. నాలుగో పెళ్ళాంగా నువ్వు రా జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనని ఆయనే కించపరుచుకున్నట్లు ఉన్నాయి..పైగా వైసీపీ నేతలకు పవన్ అవకాశం ఇచ్చినట్లు అయింది.

పవన్ మాటలను వక్రీకరిస్తూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ శల్యుడు, శికండి అంటూ ఎద్దేవ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో మెగా బ్రదర్ నాగబాబు తనకు నచ్చిన సినిమా వదిన అంటూ వదిన సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వెతుకుతున్న తీగ కాలికే తగిలినట్టు.. మెగా ఫామిలీ పరువు ఎలా తియ్యాలా అని చూస్తున్న వైసీపీ అభిమానులకు నాగబాబు మరో అవకాశం ఇచ్చినట్లు అయింది. నాగబాబు పోస్ట్ పై వైసీపీ అభిమానులు పలు రకాలుగా కామెంట్ల రూపంలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

Next Story