- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా భార్యకు క్యాన్సర్.. అయినా కొడుకు కోడలికి కనికరం లేదు..

దిశ, డైనమిక్బ్యూరో/ నందిగామ : మేం ఎక్కడికని వెళతాం..ఎలా బతుకుతాం.. అంటూ ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొదుకు..కోడలి వద్ద తిండికి, నీళ్లకు కూడా బతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందంటూ వాపోయారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన కుమారుడే వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ముక్కపాటి కాలనీలో వెలుగు చూసింది. కుమారుడే వేధింపులకు గురి చేయడం, వీధిపాలు చేయడానికి ప్రయత్నించడంతో విసిగిపోయిన ఆ వృద్ధ దంపతులు చివరకు పోలీసులను కూడా ఆశ్రయించారు.
పట్టణానికి చెందిన మాడుగుల వెంకటేశ్వర్లు భార్య కరుణమ్మ వృద్ధాప్యంలో ఉన్నారు. 72 ఏళ్ల ఆమెకు క్యాన్సర్. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఆస్తి పంపకాల్లో భాగంగా కొడుకు కృపారావుకు ఇళ్లు రాసిచ్చారు. ఆ ఇంట్లో కూడా ఉంటూ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపై కన్నేశాడు. వారిద్దరినీ బయటికి గెంటి వేస్తున్నాడు. క్యాన్సర్ తో ఉన్న భార్య, వృద్ధాప్యంలో ఉన్న తాను ఎక్కడికని వెళతాము . ఎలా తుకుతాం, మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. తిండికి, నీళ్లకు బ్రతిమిలాడే పరిస్థితి వచ్చింది. కొడుకు, కోడలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా పై దాడికి కూడా పాల్పడ్డారు. ఇప్పుడున్న ఇంటి దస్తావేజులు అతని దగ్గరే పెట్టుకున్నాడని వారిద్దరూ మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామని, ఆర్డీవో ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం అందించిన ప్రయోజనం లేదన్నారు.తమకు న్యాయం చేయాలని వారు వేడుకొంటున్నారు