- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తాడిపత్రిలో ఆటో డ్రైవర్లకు బిగ్ షాక్.. ఇకపై అలా చేయొద్దంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road Accident)పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Diwakar Reddy) ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చాలా చోట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు ఆటోలే గురవుతున్నాయని గతంలోనే ఆయన ప్రకటన చేశారు. ఆటో(Auto)లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లను కట్టడి చేస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా కేంద్రంగానే చెప్పారు.
అయితే తాడిపత్రి ఆటో డ్రైవర్లపై తాజాగా JC ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ సీటులో ప్యాసింజర్లు ఉండకూడదని హుకుం జారీ చేశారు. ప్యాసింజర్లను ముందు సీటులో కూర్చోబెట్టుకుంటే డ్రైవర్లను ఆర్టీవోకు పట్టిస్తానని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు కష్టం చేసుకుని బతుకుతున్నారని, వాళ్లు కూడా బతకాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని చెప్పారు. ఇకపై ఊరుకునేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.