- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mudragada Padmanabham: వీధి రౌడీ భాష మాట్లాడటం ఏంటి? పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ్డ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : పార్టీ పెట్టిన తరువాత పదిమంది చేత ప్రేమించబడాలి గాని వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంత వరకూ న్యాయమంటారు ? అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఘాటుగా ప్రశ్నించారు. రాజకీయాలలో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోవాలి. ఉద్యమాలలో అయితే ఎవరింటికి వెళ్లి సహాయం చేయమని అడగనవసరం లేదు. మనం చేసే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉంటారని ముద్రగడ పద్మనాభం హితవు పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా సలహాలు ఇస్తున్న వారి పట్ల ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్క తీస్తా , నార తీస్తా , క్రింద కూర్చోబెడతా , చెప్పుతో కొడతా , గుండు గీయిస్తా అంటూ పదేపదే వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి , క్రింద కూర్చోబెట్టారో , గుండ్లు ఎంతమందికి చేయించారో , ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి అని డిమాండ్ చేశారు . మంగళవారం ఉదయం జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను ఏనాడు కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయలేదు
రాష్ట్రంలో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులు తాను రాస్తున్న లేఖ పట్ల తనను తుది ముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చు అంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ నిజాన్ని నిర్భయంగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. తాను కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడుగా ఎదిగినట్లు యువతను వాడుకుని బావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నానని ఉద్యమాన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేయలేదంటూ పవన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను అని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వారి ద్వారా మీరే కల్పించారు . ప్రతిపక్ష నాయకులు హోదాలో వైఎస్ జగన్ జగ్గంపేట సభలో రిజర్వేషను అంశం తన చేతిలో ఉండదు కేంద్రం పరిధిలోది అన్నప్పుడు తాను తీవ్రంగా ఖండించినట్లు గుర్తు చేశారు.
అనంతరం కాపులకు రూ.10వేల కోట్లు ఇస్తానంటే కుదరదని చెప్పానని..మీ సామాజిక వర్గానికి 20 వేలు కోట్లు ఇస్తాం.. బీసీల నుండి పిల్లి సుభాష్ చంద్రబోసునో, కాపుల నుండి బొత్స సత్యన్నారాయణనో ముఖ్యమంత్రిని చేయమని ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను స్వార్ధపరుడను కోట్లాది రూపాయలు సూట్ కేసులకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదు ...అమ్ముడు పోలేదు అని వివరణ ఇచ్చారు. ‘నాకంటే చాలా చాలా బలవంతులైన మీరు నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి. కులాన్ని అడ్డం పెట్టుకుని ఎప్పుడూ ఏ పదవి పొందలేదు . ఎవ్వరిని బెదిరించి కోట్లాది రూపాయలు పొందలేదు. ఒకప్పుడు ఓటమి ఎరగని నేను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యాను . దీనిని బట్టి నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుకోండి’ అని ముద్రగడ పద్మనాభం లేఖలో తెలియజేశారు.
ద్వారంపూడి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది
మరోవైపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తిట్టడానికి విలువైన సమయాన్ని వృద్ధా చేయోద్దు అని ముద్రగడ పద్మనాభం సూచించారు. ప్రత్యేక హోదా , విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకం నుండి కాపాడడం , ప్రత్యేక రైల్వే జోన్ , కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్ధం చేయండి కానీ నాలాంటి అనాధల మీద కాదండి . విమర్శలు ఆపి పైన రాసిన వాటిపై కార్యాచరణ తయారు చేసుకుని రోడ్డు ఎక్కండి’ అని పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సూచించారు. మీ వారాహి విజయ యాత్ర ప్రారంభంనుండి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వారి కుటుంబ భ్యులు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించారనే తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.
1984లో నాటి సీఎం ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తే నేను తీసుకోకపోతే కృష్ణారెడ్డి , భాస్కరరెడ్డి ఉదయం 6 గంటలకు కిర్లంపూడి వచ్చి 2 గంటలు ఉండి ఎన్నో నా కుటుంబ విషయాలు చెప్పి మంత్రి పదవి తీసుకుని పదిమందికి సహాయపడమని సలహా ఇచ్చిన గౌరవమైన కుటుంబం అని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లారీలు , కార్లు , సప్లై యిచ్చేవారన్నారు. 1988లో విజయవాడ కాపునాడు సభకి సుమారు 100 లారీలు , సహాయంగా పొందినట్లు తెలిపారు. 1993-94 కాపు ఉద్యమం టైంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఉద్యమం సంబంధించిన పోస్టర్లు వేయించుకోవడానికి 50 రూపాయలు లేని సమయంలో 50 వేల రూపాయలతో పోస్టర్లు వేయించిన కుటుంబం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం అని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. కాపులు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదు అని హితవు పలికారు. కాపులు తరఫున చేసిన ఉద్యమాలకు మీరెందుకు రాలేదని తానేమీ ప్రశ్నించదలుచుకోలేదు అని చెప్పుకొచ్చారు.
బీజేపీ,టీడీపీతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రిని చేయండి అనడం ఏంటి?
తరచూ మీ ఉపన్యాసాలలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు , మిత్రులు ఉండరన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొంగ అయితే రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎలా గెలుపొందారో ఆలోచించండి అని సూచించారు. ద్వారంపూడి దుర్మార్గుడు అయితే అలాంటి దుర్మార్గపు ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించండి అని ఉచిత సలహా ఇచ్చారు. దుర్మార్గులను శాశ్వతంగా రాజకీయాలనుండి తొలిగేలా చేయండి అని హితవు పలికారు. మరొక విషయం బీజేపీ ,టీడీపీ, మీరు కలసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని... అటువంటప్పుడు నా జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వండి అని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎలా అడుగుతున్నారో నాకు అర్ధంకావడం లేదు అని అన్నారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండి అనే పదం వాడాలి తప్ప కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదంగా ఉంది అంటూ ముద్రగడ పద్మనాభం లేఖలో వ్యాఖ్యానించారు.
Read more :
తోక ముడిచి వెళ్తున్నారు: పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్