- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mudragada Padmanabham: వీధి రౌడీలా మాట్లాడొద్దు.. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర విమర్శలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్ర కాకరేపుతోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య మాటల యుద్ధం ఎన్నికల వేడిని తలపిస్తోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు, తీవ్ర విమర్శలు చేసుకుంటడంతో ఎన్నికలకు మరింత సమయం ఉండగానే రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అయితే, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర విమర్శలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 10 మంది చేత ప్రేమించబడాలి.. అంతేకానీ వీధి రౌడీలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పవన్‌పై మండిపడ్డారు.
మీ ప్రసంగాల్లో పదే పదే తొక్కతీస్తా.. నార తీస్తా.. చెప్పుతో కొడతా.. కింద కూర్చొబెడతా.. గుండు గీయిస్తా అని అంటున్నారు.. ఇప్పటి వరకు అలా ఎంతమందిని చేశారో చెప్పండని ప్రశ్నించారు. కేవలం ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే సమయం వృధా చేసుకోవద్దని సూచించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిది గౌరవప్రదమైన కుటుంబం అని.. కాకినాడ ఎమ్మెల్యే, అతని తండ్రి, తాత తప్పుడు మార్గాల్లో సంపాదించారనడం తప్పు అని పేర్కొన్నారు. కాపు ఉద్యమాలకు సహకరించిన వారిని విమర్శించడం సరికాదన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పారు. చాలెంజ్ చేసినట్లుగా పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి సత్తా చూపండని అన్నారు.
Read more :
తోక ముడిచి వెళ్తున్నారు: పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్