- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: CBI విచారణకు అవినాష్ రెడ్డి డుమ్మా.. హుటాహుటిన పులివెందుల పయనం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావడం లేదని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ.. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరు అవ్వడానికి కొన్ని నిమిషాల ముందే ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అవినాష్ తల్లిని పులివెందులోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ్టి సీబీఐ విచారణకు వెళ్లకుండా హుటాహుటిన హైదరాబాద్ నుండి పులివెందుల బయలుదేరారు. అయితే, ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. కానీ, అత్యవసర పనులు ఉన్నాయని ఆ రోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీబీఐ.. ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్ రెడ్డి ఇవాళ కూడా సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో సీబీఐ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.