ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లే లక్ష్యం: Vijayasai Reddy

by srinivas |
ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లే లక్ష్యం: Vijayasai Reddy
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రతిపేద కుటుంబానికి సొంతిల్లు సీఎం జగన్ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకానికి సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో పేద ప్రజల ఇళ్ల కోసం 30.25 లక్షల మందికి 71,811.49 ఎకారాల్లో,ఇళ్ల స్థలాల పంపిణి కోసం రూ.56,102.91 కోట్లు వ్యయం చేసిందన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.36.026 కోట్లు వ్యయం చేయగా,లబ్ధిదారులకు ప్రభుత్వం వాటి కింద చెల్లింవులు, ఇతర రాయితీల కోసం రూ.13,758 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. టిడ్కో పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల లబ్ధి. ప్రభుత్వం టిడ్కో హౌసింగ్ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 21000 కోట్ల లబ్ధి చేకూరుస్తోందని పేర్కొన్నారు.

- అంబేద్కర్ ఆశయాల సాధిస్తాం

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఆయన సేవలను విజయసాయిరెడ్డి కొనియడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ఈ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed