రిజర్వేషన్లపై మా ఆలోచనలో మార్పు లేదు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

by srinivas |
రిజర్వేషన్లపై మా ఆలోచనలో మార్పు లేదు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: రిజర్వేషన్లపై తమ ఆలోచనలో మార్పు లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ తరపున శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు భారీగా మెజార్టీతో గెలవడంతో కేంద్రంలో ఆయనకు కీలక పదవి దక్కింది. మోడీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా ఆయనకు స్థానం కేటాయించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర కేబినెట్‌లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని తెలిపారు. చాలా సమయం తర్వాత TDPకి కేంద్రమంత్రి పదవి దక్కిందన్నారు. కేంద్రంతో దృఢమైన సంబంధాలు ఉన్నాయని, చర్చల తర్వాతే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఏపీ అభివృద్ధే తమకు ముఖ్యమని రామ్మోహన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story