Mp Raghurama: ఎంపీ అవినాశ్ అరెస్ట్‌ ఆగిపోవచ్చు..!

by srinivas |
Mp Raghurama: ఎంపీ అవినాశ్ అరెస్ట్‌ ఆగిపోవచ్చు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఢిల్లీలో సోమవారం ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా ఎంపీ అవినాశ్ రెడ్డి పప్పులు ఉడకవని చెప్పారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అయ్యిందని, దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్‌కు ఉన్న అడ్డంకులు తొలగినట్లేనని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ బందరు పర్యటనలో ఉన్నారని... ప్రజల మధ్య జగన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే బాగోదనే అవినాశ్‌ను అరెస్ట్ చేయలేదని భావిస్తున్నట్లు తెలిపారు. జగన్ తాడేపల్లికి చేరుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఒకవేళ అవినాశ్‌కు గుండెజబ్బు, హార్ట్ ఆపరేషన్ అంటూ 10 మంది డాక్టర్లు, 10 మంది యాక్టర్లు ఏదైనా డ్రామా చేస్తే అరెస్ట్ ఆగిపోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ విషయంలో కర్నూలు ఎస్పీ, డీఐజీ, ఏపీ పోలీసులు చాలా చిల్లరగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్దకు కడప, పులివెందుల నుంచి వచ్చిన 10 మంది ఆకు రౌడీలు ఉంటే వారిని అరెస్ట్ చేయలేరా? అని ప్రశ్నించారు రౌడీలను అరెస్ట్ చేయడం చేతకాని పోలీసులకు తమలాంటి వాళ్లను వేసుకెళ్తారంటూ మండిపడ్డారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కర్నూలు ఎస్పీ, డీఐజీలను తక్షణమే కేంద్రం సర్వీసుల నుంచి తొలగించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

ఇకపోతే ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే భయం సీఎం వైఎస్ జగన్‌లో నెలకొందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి గైర్హాజరవ్వడం వెనుక జగన్ ఆదేశాలు ఉన్నాయని ఎంపీ రఘురామరాజు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed