గవర్నర్ అబ్థుల్ నజీర్‌కు ఎంపీ జీవీఎల్ వినతి

by Seetharam |
గవర్నర్ అబ్థుల్ నజీర్‌కు ఎంపీ జీవీఎల్ వినతి
X

దిశ , డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణ సమస్యపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖపట్నంలో ఆదివారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు పలవురు ప్రతినిధులతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలిశారు. విశాఖపట్నంలో నాలుగు లక్షలకు పైగా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి లబ్ది చేకూరెలా ఏడేళ్ల క్రితం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు "పరశురామ భవన" నిర్మాణం నిమిత్తం గోపాలపట్నం మండలం మాధవధార గ్రామంలో కేటాయించబడి సర్వే నంబర్ 61ఏ/1లోని 0.22 సెంట్ల స్థలం బదలాయింపులో ఉద్దేశపూర్వక జాప్యం జరిగిందని..దీనిపై చోరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయవలసినదిగా గవర్నర్‌ని కోరారు. విశాఖపట్నంజిల్లా బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులను రాష్ట్ర గవర్నర్ వద్దకు తీసుకువెళ్ళి వారిచే సంబంధిత సమస్యపై వినతి పత్రాన్ని అందించారు. దీనిపై గవర్నర్ అబ్ధుల్ నజీర్ సానుకూలంగా స్పందించారని ఎంపీ జీవీఎల్ స్పందించారు. అంతేకాదు సంబంధిత అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. దీంతో బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed