పులివెందులలో లక్షకు పైగా మెజార్టీ ఖాయం: YS భారతి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:28 April 2024 2:49 PM  )
పులివెందులలో లక్షకు పైగా మెజార్టీ ఖాయం: YS భారతి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందులలో వైసీపీకి లక్షకు పైగా మెజార్టీ ఖాయమని సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి కీలక వ్యాఖ్యలు చేశారు. భర్త జగన్ తరుఫున ఆదివారం ఆమె పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి మీడియా మాట్లాడుతూ.. పులివెందులలో ప్రజల స్పందన చాలా బాగుందని తెలిపారు. జగన్ పథకాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. పులివెందులలో ఈ సారి లక్షకు పైగా మెజార్టీ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం.. పులివెందులకు వైఎస్ కుటుంబం బలమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్నారన్నారు. ప్రచారంలో వైఎస్ భారతి వెంట కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డ భార్య సమత కూడా ఉన్నారు.

Read More...

రంగంలోకి వైఎస్ జగన్ భార్య భారతి.. పులివెందులలో జోరుగా ప్రచారం

Advertisement
Next Story