లేపాక్షిని సందర్శించిన మోడీ..వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

by Indraja |
లేపాక్షిని సందర్శించిన మోడీ..వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
X

దిశ వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న విషయం అందరికి సుపరిచితమే. శ్రీ సత్యసాయి జిల్లా లోని పాలసముద్రంలో ఆసియా ఖండం లోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ కి విచ్చేసారు మోడీ. ఈ నేపథ్యంలో లేపాక్షిలో శ్రీదుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించిన ఆయన.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వేద పండితులతో కలిసి జయ రామ అని చప్పట్లు కొడుతూ భజన చేశారు. అలానే ప్రధాని మోడీకి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ స్థల పురాణాన్ని తోలు బోమ్మలాట ప్రదర్శన ద్వారా చూపించారు. ఆ తరువాత ప్రధాని మోడీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రదర్శనను ఆసక్తిగా చూసిన మోడీ.. ప్రదర్శన అనంతరం అక్కడి నుంచి పాల సముద్రం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక అక్కడ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి, ఇన్స్టిట్యూట్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Advertisement

Next Story

Most Viewed