Prajagalam Sabha: చిలకలూరిపేట సభలో తెలుగులో ప్రసంగించిన మోడీ

by srinivas |   ( Updated:2024-03-17 12:36:26.0  )
Prajagalam Sabha: చిలకలూరిపేట సభలో తెలుగులో ప్రసంగించిన మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీయే కూటమికి ఓట్లు వేసి 400 సీట్లు ఇవ్వాలని ప్రధాని మోడీ అన్నారు. చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగించారు. కోటప్పకొండ ఈశ్వరుడి ఆశీస్సులతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. తర్వాత రోజు అయిన ఇవాళ ఏపీకి వచ్చానని చెప్పారు. అభివృద్ధి చెందిన ఏపీని చూడాలంటే రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేకు ఓటు వేయాలని కోరారు. ప్రాంతీయ, జాతీయ భావంతో ఎన్డీయే అడుగులు ఉంటాయని చెప్పారు. ఏపీ వికాసానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన కృషిని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed