- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఒంగోలులో మళ్లీ ఓట్ల లెక్కింపు.. 12 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల మాక్ పోలింగ్ చేపట్టనున్నారు. అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనకు ఈవీఎంలు, ఓటింగ్సరళిపై అనుమానాలు ఉన్నట్లు అభ్యంతరం తెలిపారు. ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ జరపాలని కోరుతూ ఎన్నికల సంఘానికి రుసుం చెల్లించారు. ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంల్లో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
దామచర్ల విజయఢంకా..
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయ ఢంకా మోగించారు. నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 34,060 ఓట్లతో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు. వైఎస్సార్సీపీ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూటమిపై ఉన్న నమ్మకంతో దామచర్ల జనార్ధన్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే ఓటింగ్ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇందుకోసం ఈ నెల 19 నుంచి 24వ తేదీ మధ్యలో ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే తేదీ ఖరారు చేయనున్నారు. దీనిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికారులు సమాచారం అందించనున్నారు.