Graduate mlc elections: కూటమి వర్సెస్ ​పీడీఎఫ్.. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

by Anil Sikha |
Graduate mlc elections: కూటమి వర్సెస్ ​పీడీఎఫ్..  రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోరు
X

దిశ, డైనమిక్​ బ్యూరో: ఏపీలోని రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు (Graduate mlc elections) రేపు గురువారం ఎన్నికలు జరగున్నాయి. గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. ఈ పోలింగ్​ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్​స్టేషన్​ను ఎన్నికల అధికారుల వెబ్​కాస్టింగ్​చేస్తన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 22,493 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం 60 మంది పోటీ పడుతున్నారు.. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 10 మంది పోటీ పడుతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తమ అభ్యర్థులను నిలబెట్టింది. వారితో పీడీఎఫ్(pdf)​ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వైసీపీ(ycp) ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఏపీటీఎఫ్​కు కూటమి మద్దతునిచ్చింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి (kootami) బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్​ నుంచి డీవీ రాఘవులు బరిలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్​ అభ్యర్థి కేఎస్​ లక్ష్మణరావు పోటీలో ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఈ ఎన్నికలకు సంబంధించి మౌనంగా ఉన్న వైసీపీ తన ఎత్తుగడను మార్చి పీడీఎఫ్​అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్నికల రాజకీయం కొంత వేడెక్కింది. గతంలో చంద్రబాబు ఈ ఎన్నికపై దిశానిర్దేశం కూడా చేశారు. ఈ ఎన్నికలను సీరియస్​గా తీసుకోవాలన్నారు. లోకేశ్​సైతం మంత్రులతో సమావేశమయ్యారు. నిన్న జనసేన అధినేత పవన్​కల్యాణ్(janasena)​, బీజేపీ(bjp) ఏపీ చీఫ్​పురందేశ్వరి కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ వీడియోలు విడుదల చేశారు. దీనిని బట్టి ఈ ఎన్నికను కూటమి ఎంత సీరియస్​గా తీసుకుందో అర్ధం అవుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు హోరాహోరీగా మారాయి. పట్టభద్రులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Advertisement
Next Story

Most Viewed