- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అమిత్ షా విశాఖలో కేవలం గంట సేపు మాత్రమే పర్యటిస్తారని ప్రకటన వెలువడింది. అమిత్ షా దాదాపు రెండు గంటలకు పైగా విశాఖలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా కేవలం ఒక గంటసేపు మాత్రమే అమిత్ షా విశాఖలో ఉంటారని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం ఢిల్లీ వెళ్లిపోతారని సమాచారం. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు అంటే గంటసేపు జరగనున్న పోలింగ్ బూత్ శక్తి ప్రముఖ్‌లతో అమిత్ షా భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ భేటీలో అమిత్ షా పాల్గొనరని బీజేపీ తెలిపింది. రాష్ట్ర నాయకులే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఇకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తొమ్మిదేళ్ల పాలనలో మోడీ సుపరిపాలన, సేవా, ప్రజల సంక్షేమం లక్ష్యంగా విజయవంత పాలన ఫలాలను గురించి ప్రజలకు వివరించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖలో రానున్నారు. విశాఖలోని రైల్వే గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో మోడీ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజలకు వివరించనున్నారు.