- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బంధువులకు హైకోర్టులో చుక్కెదురైంది. గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో 21.50 ఎకరాల స్థలంలో గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నారు. అయితే తమకు తెలియకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసి ఇవ్వడంపై హైకోర్టులో స్థానిక రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండా తవ్వకాలు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ ఇచ్చిన తహసీల్దార్‌తో మంత్రి విడదల రజిని ఎంపీ అవినాశ్ రెడ్డి బంధువులు శ్వేతారెడ్డి, శివపార్వతి, జీవీ దినేశ్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్10కి వాయిదా వేసింది.
Release date:
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
- Tags
- ap politics