వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు.. మంత్రి వాసంశెట్టి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-08-19 09:15:35.0  )
వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు.. మంత్రి వాసంశెట్టి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని మంత్రి వాసంశెట్టి సుభాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ ఎమ్మె్ల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము గేట్లు ఎత్తితో వైసీపీలో జగన్ తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. కానీ తమ నాయకుడు చంద్రబాబు ఎవరినీ పార్టీలోకి చేర్చుకోవద్దన్నారని, అందువల్లే తాము డోర్లు తీయడం లేదని వాసంశెట్టి తెలిపారు. సింహం సింగిల్ వస్తుందని జగన్ చెప్పుకున్నారని, ఏకంగా ఆయనకు రాష్ట్రప్రజలు 11 మందిని ఇచ్చారన్నారు. గత ఐదేళ్లలో చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని జగన్ అసెంబ్లీకి రావడంలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఫామ్ కావడం ఇక చూడమని వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed