Kakinada : మంత్రి వాసంశెట్టికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

by M.Rajitha |
Kakinada : మంత్రి వాసంశెట్టికి తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamshetti Subhash) కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఏర్పాటు చేసిన శెట్టిబలిజల పిత దొమ్మేటి వెంకటరెడ్డి(Dommeti Venkatareddy) విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తోపాటు, స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ(Satyaprabha) పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగ కార్యక్రమం నడుస్తుండగా.. సభా వేదిక ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో వేదిక మీద ఉన్న మంత్రి కిందపడబోగా.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అనుచరులు పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. అనంతరం వేదికను మరో చోటికి తరలించి, తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహకులు.

Advertisement

Next Story

Most Viewed