- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
దిశ, రాయచోటి: రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రివర్యులు పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా 4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందన్నారు. దీంతో పలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో గ్రామాలలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు, మంచినీటి సమస్య పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.