Amaravati: ఒకటనుకుంటే.. ఇంకోటి జరిగింది..!

by srinivas |
Amaravati: ఒకటనుకుంటే.. ఇంకోటి జరిగింది..!
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని ప్రాంతం(Capital Aria)లో మంత్రి నారాయణ(Minister Narayana) పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా ఏపీ రాజధానిని చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు డిజైన్లను నార్మన్ ఫాస్టర్ చేత చేయించామని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జిలు కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించామని తెలిపారు. తమపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసిందని మండిపడ్డారు.


అసెంబ్లీనీ 250 మీటర్ల ఎత్తులో నిర్మించి....మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌గా చేయాలని డిజైన్ చేశామని నారాయణ తెలిపారు.. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్‌లు డిజైన్ చేశామని చెప్పారు. కోటీ 3 వేల చదరపు అడుగులతో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను మొత్తం నీళ్ళలో పెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేశామన్నారు. విద్యుత్ లైన్ లు,డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ అండర్ గ్రౌండ్‌లో ఉండేలా డిజైన్ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం మొత్తం అడవిగా మార్చేసిందని ధ్వజమెత్తారు. ఇలా చేసినందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారని ఆరోపించారు. వైనాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయని ఎద్దేవా చేశారు. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభ ఆలస్యం అయిందన్నారు. ఇప్పటి వరకూ మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని, జనవరి నెలాఖరులోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులను గురి చేసిందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed