ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కీలక ప్రకటన చేసిన మంత్రి

by Mahesh |
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కీలక ప్రకటన చేసిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తాము అధికారంలో రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీల అమలుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ లను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. తాజాగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై కసరత్తులు చేస్తున్నారు. నేడు రవాణా శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా చూస్తున్నాం అని తెలిపారు. దీంతో పాటుగా దర్శి లో రూ. 18.51 కోట్ల అంచనాలతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు ఫైలుపై మంత్రిగా తొలి సంతకం చేశారు.

Advertisement

Next Story

Most Viewed