- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీకి బిగ్ షాక్.. ఆ జీవో రద్దుపై లోకేశ్ కీలక సమావేశం

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.117(GO No. 117 Withdrawal) విద్యారంగానికి గొడ్డలిపెట్టుగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోకు కూటమి ప్రభుత్వం స్వస్థి పలికేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాదు ఇందుకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు పాఠశాలల విద్యా శాఖ కూడా అవసరమైన ప్రక్రియను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సహ్నాహక మార్తదర్శకాలపై ఉత్తర్వులు విడుదల చేసింది. వీటి ఆధారంగా రాబోయే 2 నెలలు పాటు క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేయాలని, అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది.
అయితే టీచర్ల బదిలీల విషయంలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముసాయిదాను అందుబాటులోకి తెచ్చింది. మే 31 నాటికి ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లు, హెడ్ మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ కావాలని ముసాదాలో ప్రభుత్వం ఆదేశించింది. రెండేళ్లు సర్వీస్ ఉండే వాళ్లు అభ్యర్థన చేసుకుంటేనే బదిలీ ఉంటుందని తెలిపింది. అభ్యర్థన చేసుకోకపోతే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ నెల 7వరకూ వెబ్ సైట్ ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టేందుకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) దూకుడు పెంచారు. ఈ మేరకు ఎమ్మెల్యేల నిర్ణయం తెలుసుకుంటున్నారు. అమరావతి(Amaravati)లో సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 117 ఉపసంహరణ, టీచర్ల బదిలీలపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం తీసుకుంటున్నారు.